Anand Mahindra: ఓ రైతు వాడుతున్న ట్రాక్టర్ ను చూసి ఆనంద్ మహీంద్రా షాక్.. కారణం ఏమిటంటే..
Anand Mahindra: ఓ రైతు వాడుతున్న ట్రాక్టర్ ను చూసి ఆనంద్ మహీంద్రా షాక్.. కారణం ఏమిటంటే..
బాలా దేవ్ కేట్ (Bala devkate) అనే వ్యక్తి ట్విట్టర్ లో ఒక వీడియో షేర్ చేశాడు. 'ఆనంద్ మహీంద్రాకు ఆ గ్రూపుకు చాలా థ్యాంక్స్. నేను 265 DI 35 HP ట్రాక్టర్ ను 1988లో కొన్నాను. అప్పటినుండి ఈ ట్రాక్టర్ ను ఉపయోగిస్తున్నాను. ఈ ట్రాక్టర్ 35సంవత్సరాలు పూర్తిచేసుకుంది. అయినా ఇప్పటికీ చాలా చక్కగా పనిచేస్తోంది. సుమారు 12టన్నుల వంటచెరకును మోస్తున్నా ఏమాత్రం ఇబ్బంది లేదు' అని ట్రాక్టర్ వంటచెరకును మోస్తూ నడుస్తున్న వీడియోను షేర్ చేశాడు. అది చూసిన ఆనంద్ మహీంద్రా షాకయ్యారు. ఆ తరువాత సంతోషానికి లోనయ్యారు. 'తమ వాహనాలు సాధారణ పౌరుల జీవితాల్లో ఇంతగా భాగమైపోవడం తమకెంతో ఆనందంగా ఉంది' అంటూ ఆనంద్ మహీంద్రా ఆ వీడియో షేర్ చేసుకున్నారు.